ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు పని చేసే వేళలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23 శుక్రవారం నుంచి మే 15 వరకుఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.
కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలలో భాగంగా ఈ విధంగా బ్యాంకు పని వేళల్లో మార్పులు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసింది.బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్‌లు, ప్రభుత్వ లావాదేవీలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇతర సేవలను అవసరాన్నిబట్టి కొనసాగించాలని తెలిపారు.
బ్యాంకులకు కూడా అందరూ కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రమే,బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని మిగిలినవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరాలను తీర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కచ్చితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
బ్యాంకు పని వేళల్లో మార్పులు చేయడమే కాకుండా వర్క్ ఫ్రం హోం సదుపాయం కలిగిన వారికి వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని, కేవలం తక్కువ మంది సిబ్బందితో బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.పెన్షన్, డీబీటీ వంటి చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా నిధులు ఉంచుకోవాలని.. ఏటీఎంలు, వాటికి సంబంధించిన ఇతర సేవలు సాధారణంగానే కొనసాగుతాయన్నారు. అదేవిధంగా బ్యాంకుసమయాలలో మార్పులు చేసినట్లు ప్రజలందరికీ తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని
ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…