ఏపీ ప్రజలకు హై అలర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ మారాయి!

0
60

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు పని చేసే వేళలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23 శుక్రవారం నుంచి మే 15 వరకుఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది.

కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలలో భాగంగా ఈ విధంగా బ్యాంకు పని వేళల్లో మార్పులు చేసినట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సూచనల మేరకు ఆదేశాలు జారీ చేసింది.బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్‌లు, ప్రభుత్వ లావాదేవీలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇతర సేవలను అవసరాన్నిబట్టి కొనసాగించాలని తెలిపారు.

బ్యాంకులకు కూడా అందరూ కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రమే,బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని మిగిలినవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరాలను తీర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కచ్చితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

బ్యాంకు పని వేళల్లో మార్పులు చేయడమే కాకుండా వర్క్ ఫ్రం హోం సదుపాయం కలిగిన వారికి వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని, కేవలం తక్కువ మంది సిబ్బందితో బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.పెన్షన్, డీబీటీ వంటి చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా నిధులు ఉంచుకోవాలని.. ఏటీఎంలు, వాటికి సంబంధించిన ఇతర సేవలు సాధారణంగానే కొనసాగుతాయన్నారు. అదేవిధంగా బ్యాంకుసమయాలలో మార్పులు చేసినట్లు ప్రజలందరికీ తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని
ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here