Categories: Movie News

Actress : మతిస్థిమితం కోల్పోయి.. రోడ్డుపై అనాథలా తిరుగుతూ కనిపించిన టాప్ హీరోయిన్!

సినిమా ప్రపంచంలో స్టార్‌డమ్ సాధించడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు నటీనటులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అనుకోని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న తారలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ బెంగాలీ నటి ఇప్పుడు దీనస్థితిలో బతుకీడుస్తోంది. ఎన్నో సీరియల్స్‌లో నటించి బుల్లితెరను శాసించిన ఈ నటి, ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా రోడ్డు పక్కన నివసిస్తోంది.

Bengali actress Sumi Har Chowdhury was found wandering in a confused state in West Bengal

ఆమె పేరు సుమి హర్ చౌదరి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో ఆమె రోడ్డు పక్కన తిరుగుతూ కనిపించింది. షార్ట్స్, నల్ల చొక్కా ధరించి, కాగితంపై ఏదో రాస్తూ, బెంగాలీ, ఇంగ్లీష్ రెండు భాషలలో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. తొలుత ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. తాను నటినని, తనకు ఆశ్రయం కావాలని అక్కడ వెళ్లేవారిని అడుగుతూ కనిపించింది.

ఆమె పేరు చెప్పడంతో, కొందరు స్థానికులు గూగుల్ సెర్చ్ చేయగా.. ఆమె ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో సుమి హర్ చౌదరి ఒకప్పుడు ప్రముఖ నటి అని నిర్ధారించుకున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి ఈ దీనస్థితిలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago