Movie News

Mallika Sheravath : “”ఆ హీరోలు రాత్రికి రమ్మనేవారు.. ఒప్పుకోలేదు.. అందుకే అవకాశాలు..” మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు!

ముంబై: సినిమా పరిశ్రమలో నటీనటులు స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం అంత సులభం కాదు. ఒకవేళ గుర్తింపు తెచ్చుకున్నా, ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడం మరింత కష్టం. కొందరు తారలు ఉన్నత స్థాయికి ఎదిగి, ఆ తర్వాత అనుకోకుండా అవకాశాలు కోల్పోయి ఆర్థిక, మానసిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలు, ఆ తర్వాత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ మల్లికా షెరావత్ కూడా అలాంటి సమస్యనే ఎదుర్కొన్నానని, క్యాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకోకపోవడంతో సినిమా అవకాశాలు కోల్పోయానని ఎమోషనల్ అయ్యింది.

mallika sheravath sensational words about casting couch

ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ లాగే మల్లికా షెరావత్ కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన మల్లికా షెరావత్, ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టి, ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

“రాత్రిపూట కలవమన్నారు.. ఒప్పుకోలేదు”

మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల వల్ల కూడా తరచుగా వార్తల్లో నిలిచింది. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతోంది.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మల్లికా షెరావత్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. “చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలి అని అడిగేవారు. నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్లాలి? సినిమాల్లో బోల్డ్‌గా నటించినంత మాత్రానా నేను ఆ హీరోలు చెప్పినట్టు వినాలా? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి” అని మల్లికా షెరావత్ ఆవేదన వ్యక్తం చేసింది.

“నేను ఆ టైప్ కాదు. తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడూ అంగీకరించలేను” అని మల్లికా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago