Bhuma Mounika Reddy : మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో వివాహం భూమా మౌనిక రెడ్డిని చేసుకోవడంతో భూమా మౌనిక రెడ్డి బ్యాక్ గ్రౌండ్ మీద ఆరాలు తీసుస్తున్నారు అందరూ. అసలు మంచు మనోజ్ కి ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది, వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఎప్పటి నుండి ఉన్నారు, వీరి మొదటి వివాహాలు విఫలమవడానికి వీళ్ళ స్నేహమే కారణమా అనే విషయాలను చాలా మంది చర్చించుకుంటున్నారు. గత వినాయక చవితి రోజున మంచు మనోజ్జే తో కలిసి కనిపించిన భూమా మౌనిక రెడ్డి అప్పటి నుండి వార్తల్లో నిలుస్తోంది. అంతకు ముందు పొలిటికల్ స్పీచ్ లతో ఫేమస్ అయిన మౌనిక ఈసారి మాత్రం రెండో పెళ్లితో వైరల్ అయింది.
మొదటి పెళ్ళికి ముందే మనోజ్ తో పరిచయం…
ఆళ్లగడ్డ కు చెందిన భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కూతురు భూమా మౌనిక రెడ్డి. పుట్టింది రాయలసీమ అయినా పెరిగింది చదువుకున్నది మాత్రం హైదరాబాద్ లోనే. ఇక పై చదివుల కోసం అమెరికా వెళ్లిన మౌనిక అక్కడ డిగ్రీ అయ్యాక న్యూ యర్క్ లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో బ్రాడ్ క్యాస్టింగ్ అండ్ జర్నలిజం లో కోర్స్ చేసింది. ఇక అదే సమయంలో మంచు మనోజ్ అక్కడ ఫిల్మ్ యాక్టింగ్ కి సంబంధించిన కోర్స్ చేసాడు. ఇలా వారిద్దరికీ పరిచయం ఏర్పడటం స్నేహంగా మారడం జరిగింది. అయితే మౌనిక రెడ్డి మంచు మనోజ్ తో రిలేషన్ ను ప్రేమగా మార్చుకునేలోపే ఆమెకు తన తండి నాగిరెడ్డి గణేష్ రెడ్డి అనే వ్యాపారవేత్తకు ఇచ్చి వివాహం చేసారు. ఇక మంచు మనోజ్ కూడా ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక మౌనిక రెడ్డికి భైరవ్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. మనస్పర్తల కారణంగా మౌనిక రెడ్డి భర్తతో విడిపోయింది. ఇక మనోజ్ కూడా పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి మొదటి నుండి డేరింగ్ గా ఉంటూ తన తండ్రి చనిపోయినపుడు అక్క అఖిల ఎమ్మెల్య్ గా నిలబడినపుడు తన కోసం ప్రచారం చేయడం ద్వారా ఫేమస్ అయింది.
ఇక అఖిల ఒక కేసులో ఇరుక్కుని పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినపుడు మా అక్కను తీసుకెళ్లాలంటే నన్ను దాట్టాలి ముందు మీరు అంటూ చేసిన వాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. నిజానికి నాగిరెడ్డి గారు మరణించాక మౌనిక రెడ్డి ఆయన స్థానంలో రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించినా తాను మాత్రం అక్క కోసం ప్రచారం చేసి కష్టపడింది. ఇక ఇప్పుడు మంచు మనోజ్ ను రెండో వివాహం విషయంలోనూ ఇరు కుటుంబాలను ఒప్పించుకోవడం విశేషం. ఫ్యూచర్ లో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలను నడుమ భూమా మౌనిక మనోజ్ కోసం మరోసారి కష్టపడుతుందని అనిపిస్తోంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…