Bichagadu: ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి తెలియని వారంటూ ఉండరు. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరోగా విజయ్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమాని రూపొందించారు.
ఈ సినిమా మే 19వ తేదీన తెలుగు,తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు . ఈ క్రమంలో బిచ్చగాడు2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకున్నాడు.
ఈ సినిమాలో హీరో బిచ్చగాడి పాత్రలో నటించడం వల్ల సినిమాకు బిచ్చగాడు 2 పేరు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ సినిమాకి 2016లో విడుదలైన బిచ్చగాడు సినిమాకి ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఆ సినిమాలు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చక్కగా చూపించాము. ఇక బిచ్చగాడు 2 లో అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని తెలిపాడు. ఇక ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
ఇక ఈ ఈవెంట్ లో ..’ఒకవేళ బిచ్చగాడు సీక్వెల్ చిత్రాల్లో మీరుకాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటారు? అని విజయ్ ఆంటోనీని ప్రశ్నించగా… తెలుగులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు అయితే బిచ్చగాడు 2 కి బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చాడు. అలాగే తమిళంలో అయితే విజయ్ దళపతి లేదా అజిత్ బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చారు. అయితే బిచ్చగాడు పాత్రకి మహేష్ బాబు సెట్ అవుతాడని విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…