Bichagadu: బిచ్చగాడు పాత్రకి మహేశ్ బాబు కరెక్ట్ గా సెట్ అవుతాడు… విజయ్ ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు..?

0
23

Bichagadu: ప్రముఖ తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి తెలియని వారంటూ ఉండరు. విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హీరోగా విజయ్ ని మరొక మెట్టు ఎక్కించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఆ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమాని రూపొందించారు.

ఈ సినిమా మే 19వ తేదీన తెలుగు,తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు . ఈ క్రమంలో బిచ్చగాడు2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయం అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సినిమాలో హీరో బిచ్చగాడి పాత్రలో నటించడం వల్ల సినిమాకు బిచ్చగాడు 2 పేరు పెట్టవలసి వచ్చింది. అయితే ఈ సినిమాకి 2016లో విడుదలైన బిచ్చగాడు సినిమాకి ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఆ సినిమాలు తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం చక్కగా చూపించాము. ఇక బిచ్చగాడు 2 లో అన్నా చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని తెలిపాడు. ఇక ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Bichagadu: మహేష్ బాబు కరెక్ట్ గా సెట్ అవుతాడు…


ఇక ఈ ఈవెంట్ లో ..’ఒకవేళ బిచ్చగాడు సీక్వెల్‌ చిత్రాల్లో మీరుకాకుండా వేరే ఏ హీరో అయితే బాగుంటారు? అని విజయ్ ఆంటోనీని ప్రశ్నించగా… తెలుగులో సూపర్ స్టార్‌ మహేశ్‌బాబు అయితే బిచ్చగాడు 2 కి బాగా సూట్ అవుతారని చెప్పుకొచ్చాడు. అలాగే తమిళంలో అయితే విజయ్‌ దళపతి లేదా అజిత్‌ బాగా సూట్‌ అవుతారని చెప్పుకొచ్చారు. అయితే బిచ్చగాడు పాత్రకి మహేష్ బాబు సెట్ అవుతాడని విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.