Featured

Big Boss Baladithya : నా భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారు… మంచితనాన్ని వాడుకుంటున్నారు… బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్..!

Big Boss Baladithya : తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగాను ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఇక ‘1940 లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. మొదటగా హీరోగా చేసిన ‘చంటిగాడు’ సినిమాకు నంది అవార్డు వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్న, లిటిల్ సోల్జర్స్ సినిమాలకు కూడా నంది అవార్డులను అందుకున్నారు బాలాదిత్య. ఇక చాలా చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య ఆ తరువాత సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఇక సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేక పోయిన బాలాదిత్య ఇపుడు బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి మరోసారి ప్రేక్షకులకు చేరువ అవ్వాలని అనుకుంటున్నారు.

నా భర్తను మోసం చేస్తున్నారు…

బిగ్ బాస్ లో వారాలు గడుస్తున్న కొద్ది ఒక్కొక్కరి నిజమైన రంగులు బయటపడుతున్నాయి. ఇక బాలాదిత్య ను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంతంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ లా అతి మంచితనం ప్రదర్శిస్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే బాలదిత్య మాత్రం అందరూ కంటెస్టంట్లతో మంచిగా ఉంటూ బిగ్ బాస్ లో ఏ వివాదాల జోలికి పోకుండా ఉన్నాడు.

ఇక ఆయన భార్య బాలాదిత్య ఆట మీద అలాగే మిగిలిన కంటెస్టెంట్ల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. బాలాదిత్య స్వాతహాగా సౌమ్యుడు అంటూ, బయట ఎలా ఉన్నాడో అలానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడంటూ చెప్పింది. ఆయన మంచితనాన్ని కొంతమంది మంది వాడుకుంటున్నారు. నమ్మిన వాళ్ళే గేమ్ లో వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక తన భర్త టాప్ 5 కంటెండర్ గా ఉంటాడనే నమ్మకం ఉంది అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago