Senior NTR : సినిమా ఇండస్ట్రీలో ఎపుడు హిట్లు వచ్చి దశ తిరుగుతుందో ఎపుడు ఫ్లాప్ లు వచ్చి కూరుకుపోతారో ఎవరికీ తెలియదు. ఇక వరుసగా ఫ్లాప్ లు వచ్చి నష్టాలను చూసిన నిర్మాతలను ఆదుకోడానికి సినిమాలను చేయడం, రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసి పెట్టడం లేదా డైరెక్సటర్ ను ఆదుకోడానికి సినిమా చేయడం లేక ఇతర సినిమా చేస్తున్నా ప్రచారం చేయడం లేదా నిర్మాతగా వ్యవహరించడం వంటివి చేస్తూ చేయి అందిస్తుంటారు హీరోలు. అలాగే కొంతమంది హీరోయిన్లు. ఇక అలా అన్నగారు కూడా ఒక డైరెక్టర్ ను ఆదుకోడానికి సొంతంగా ఫైనాన్స్ చేసి సినిమా చేశారట. అయితే ఆ సినిమాతో ఆయన కెరీర్ కూడా మంచి టర్న్ తీసుకుందట.
డైరెక్టర్ యోగానంద ను నిలబెట్టిన అన్నగారు…
ఎన్టీఆర్ గారు సినిమాలను చేసే సమయాల్లో దర్శకుడు, నిర్మాత తో చక్కటి అనుబందం కలిగి ఉండేవారు. ఒక సినిమా ఫ్లాప్ అయినా లేక వేరే హీరోలతో ఆ నిర్మాణ సంస్థ సినిమా తన సినిమా పోటీ పడటం వల్ల ఫ్లాప్ అయినా వారిని పిలిచి తనతో సినిమా చేయడానికి అవకాశం ఇస్తారు. అలా ఆయనతో సినిమాలు తీసిన డైరెక్టర్ యోగనంద గారంటే ఎన్టీఆర్ గారికి ఇష్టం. అయితే కాలం కలిసిరాక ఖచ్చితంగా హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు కాస్తా ఫ్లాప్ అవసడంతో యోగానంద గారు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు.
ఇక ఎన్టీఆర్ గారు ఆయన కెరీర్ ను ఎలాగైనా చక్కదిద్ధాలని భావించి తమ్ముడు త్రివిక్రమ రావు ను ప్రొడ్యూసర్ గా పెట్టి యోగానంద గారితో ‘జయసింహా’ అనే సినిమా తీశారు. సినిమా మంచి విజయం పొందడంతో యోగనంద్ గారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇక ఎన్టీఆర్ గారి కెరీర్ కూడా ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా దూసుకుపోయింది. అంతవరకూ ఎన్ని హిట్స్ ఉన్నా ఫ్లాప్స్ ఉన్నా జయసింహా సినిమా తరువాత అన్న గారి కెరీర్ మలుపు తిరిగిందంటూ గుమ్మడి గారు ఆయన రాసుకున్న ఆత్మకథ ‘తీపి గురుతులు చేసుకో అనుభవాలు’ లో వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…