Big boss contestant Rohith : బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. అందరూ భావించినట్లే విన్నర్ గా సింగర్ రేవంత్ నిలవగా శ్రీహన్ సెకండ్ ప్లేసులో నిలిచాడు. అయితే శ్రీహన్ కు రేవంత్ కన్నా ఎక్కువ ఓట్లు పడటం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక ఆదిరెడ్డి, కీర్తి భట్, రోహిత్లు టాప్ 5లో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ లో మాత్రం అనూహ్య పరిణామాలు జరిగాయాని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి పెయిర్ గా ఎంటర్ అయిన రోహిత్ మరీనా జంటలో మరీనా మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకి వచ్చిన రోహిత్ మాత్రం చివరిదాకా హౌస్ లో కొనసాగి టాప్ 5 లో మిగిలాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గురించి అక్కడ జరిగిన పరిణామాలను గురించి మాట్లాడారు రోహిత్.
మరీనా ను వెళ్లిపొమ్మని చెప్పా…
రోహిత్ బిగ్ బాస్ నుండి వచ్చాక వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. తాజాగా యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బిగ్ బాస్ జర్నీ ఒక మినీ లైఫ్ వంటిది అంటూ చెప్పాడు. ఇక అందులో మొదటి ఐదు వారాలు జనాలు నాకు ఓట్లేస్తారా నాలాంటి వాడు బిగ్ బాస్ లో సెట్ అవుతాదా అనిపించేది కానీ ఐదు వారాల తరువాత నామినేషన్స్ లోకి వెళ్లినా ఓట్లేసి హౌస్ లో ఉంచడంతో అర్థమైంది జనాలకు నా లాంటి రిజర్వుడ్ వ్యక్తులు నచ్కుతారని అంటూ చెప్పారు రోహిత్. ఇక మరీనాను అందరూ నామినేట్ చేయడం, తను ఫిజికల్ టాస్క్ లో కష్టపడి ఆడటం చూసి ఇదంతా తనకు అవసరమా అనిపించింది.
అందుకే ఇక్కడ నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పాను. మనసులో తాను ఉండాలని ఉన్నా కూడా పైకి అలా చెప్పాను అంటూ తన భార్య గురించి తెలిపారు. ఇక తనలో మైనస్ అంటే తనకు ఏమనుకుంటున్నాడో ఎక్స్ప్రెస్ చేయలేను, ఎవరికీ చెప్పక పోవడం మైనస్ అంటూ చెప్పాడు. తనకు బిగ్ బాస్ కెరీర్ గ్రోత్ కి ఉపయోగపడుతుందంటూ చెప్పిన రోహిత్ విన్నర్ గురించి ప్రశ్నలు అడుగగా నా దృష్టిలో ఇద్దరు వినర్స్. శ్రీహన్ 40 లక్షలు తీసుకున్నాడు అలాగే ఓటింగ్ లో అతడే టాప్ లో ఉన్నాడు సో అతను విన్నర్. ఇక అలానే రేవంత్ ట్రోఫీ అందుకున్నాడు ప్రైజ్ మనీ అందుకున్నాడు కాబట్టి అతను విన్నర్ కాబట్టి నా దృష్టిలో ఇద్దరూ విన్నర్సే అంటూ రోహిత్ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…