Featured

Jabardasth Rocking Rakesh : సుజాతతో నా లవ్ స్టోరీ… తినడానికి తిండి లేక… స్మశానంలో పడుకునేవాడిని..: జబర్దస్త్ రాకింగ్ రాకేష్

Jabardasth Rocking Rakesh : ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ప్రసారమవుతు ఇప్పటికీ ఏళ్లకు ఏళ్ళు గడిచిపోయినా ఆ షో ఇప్పటికీ జనాలను అలరిస్తోంది. ఒకరకంగా టెలివిజన్ హిస్టరీ లో లాంగ్ రన్ లో సక్సెస్ ఫుల్ గా ఇప్పటికీ మంచి రేటింగ్ తో నడుస్తోంది. అంతే కాకుండా ఈ షో నుండి ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్.

సుజాత తో లవ్… స్మశానంలో పడుకున్నా…

రాకింగ్ రాకేష్ క్లీన్ కామెడితో కుటుంబం మొత్తం హ్యాపీగా తన స్కిట్స్ చూడొచ్చు అనేలా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్. తాను కమెడియన్ గా మొదలై ఇప్పుడు టీం లీడర్ గా మారి జబర్దస్త్ లో ఇప్పటికీ కొనసాగుతున్న తనకు కన్న తల్లి తరువాత జబర్దస్త్ మరో తల్లి అంటూ చెబుతున్న రాకేష్ తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నవాడు రిపోర్టర్ సుజాత ను ప్రేమించడం, పెళ్లి గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జోర్ధార్ వార్తలతో బాగా ఫేమస్ అయిన సుజాత న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తు బిగ్ బాస్ లో కూడా వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒక ఇంటర్వ్యూలో రాకేష్ తో పరిచయం పెరిగి తానే రాకేష్ కి ప్రపోజ్ చేసి తన ప్రేమను చెప్పిందట సుజాత. అలా మొదలైన ప్రేమలో తన కుటుంబంలో సుజాత బాగా కలిసిపోయిందంటూ రాకేష్ తెలిపాడు. జీవితంలో స్పిరిట్యుయాలిటీ వైపు వెళ్లిన రాకేష్ స్మశానంలో కూడా నిద్రపోయేవాడట. అక్కడ దొరికే ప్రశాంతత, పాజిటివిటీ ఇంకెక్కడా దొరకదు అంటూ చెబుతాడు రాకేష్. ఇక తన తల్లి తినడానికి తిండి లేని సమయంలోనూ మమ్మల్ని బాగా పెంచిదని తాను తినకుండా మా కడుపు నింపి పెంచిందంటూ చెప్పి ఎమోషనల్ అయ్యారు. బాబాయ్ హోటల్ ప్రోగ్రామ్ ద్వారా రాళ్లపల్లి గారితో మంచి అనుబంధం ఉందని ఆయన మరణం చాలా లోటు నా జీవితంలో అంటూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago