Clash between Chiranjeevi & Rajashekhar : ఇండస్ట్రీలో అందరం కలిసే ఉన్నాం అంటూ మాటలు చెప్పినా కొందరు ఆర్టిస్ట్ల మధ్య కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది బహిరంగంగానే విమర్శించుకుంటారు కూడా. అలాంటి వాళ్లలో అందరికీ మొదట గుర్తొచ్చేది మోహన్ బాబు గారు. ఆయన ఎవరి గురించి నచ్చక పోయినా మీడియా ముందు కొచ్చి మరీ చెబుతుంటారు. ముఖ్యంగా చిరంజీవి గారిని కొన్ని విషయాల్లో ఆయన విమర్శించడం మెగా స్టార్ అభిమానులకు నచ్చదు కూడా. ఇక అలా మెగాస్టార్ తో విబేధాలు ఉన నటుడు రాజశేఖర్. రాజశేఖర్ గారు కాంగ్రెస్ లో ఉన్న సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాలనుకున్నపుడు రాజశేఖర్ గారు చేసిన విమర్శ వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.
14 సంవత్సరాల క్రితం జరిగింది ఇదే…
హీరో రాజశేఖర్ గారు చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ అనుభవం లేని వారు రాజకీయాల్లో ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు. దీంతో అగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ గారు తన కుటుంబంతో కారులో ప్రయాణిస్తుండగా దాడి చేయడంతో చిరంజీవి గారు వెంటనే స్పందించి మరోసటి రోజు ఉదయాన్నే రాజశేఖర్ ఇంటికి వెళ్లారు.
అయితే అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన వచ్చే వరకూ ఎదురుచూసి ఆ తరువాత ఆయనను కలిసి తన అభిమానులు ఆవేశానికి చిరంజీవి గారు మీడియా ముందు రాజశేఖర్ గారికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పినా ఆ గొడవ అంతటి తో అయిపోయిందనుకున్నా ఆ ఇష్యూ తాలూకు ఫలితాలు మాత్రం చాలా ఏళ్ళు కొనసాగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…