Chalapathi Rao : తెలుగు సినిపరిశ్రమలో పరిచయం అక్కరలేని పేరు చలపతిరావు. సినిమా అవకాశాల కోసం వ్యయప్రయాసాలకు ఓర్చిన చలపతిరావు 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లోకి వెళ్తున్నాడు కదా అని సినిమా హీరోయిన్స్ వలలో పడకుండా ఆయన సతీమణి మధ్యం, మగువా, ధూమపానానికి దూరంగా ఉండాలని మొదటగా ఒట్టేయించుకున్నారు. ఆ తర్వాత 1960వ దశకంలో ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదటగా పోలీస్ పాత్రలలో కనిపించిన చలపతిరావు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించారు.
1970 దశకం చివరి భాగంలో విలన్, సబ్ విలన్ గా సినిమాలు చేయడం ప్రారంభించారు. దాదాపుగా 1200 కు పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో అనేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. సినిమాల్లో రేప్ సీన్స్ అనగానే రావుగోపాలరావు, సత్యనారాయణ వంటి వారు అందుకు చలపతిరావు పక్కాగా సరిపోతారని ఆయన పేరే సూచించేవారు. అలా దాదాపు అర్థ శత మానబంగాల్లో చలపతిరావు నటించారు.
అయితే ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు మాట్లాడుతూ…1982 సంవత్సరం రాఘవేందర్రావు దర్శకత్వంలో కృష్ణంరాజు, జయసుధ, శ్రీదేవి, రాధిక హీరో హీరోయిన్లుగా “త్రిశూలం” చిత్రం విడుదలైందని ఆ సినిమా ఒక పల్లెటూరులో చిత్రీకరణ జరిగిందని.. అయితే విలన్ రావుగోపాలరావు దగ్గర రౌడీ మూకాల్లో ఓ మొరటు పాత్రలో నేను నటించాను. ఆ పల్లెటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను చూసిన అమ్మాయిలు.. ఆ తర్వాత షూటింగ్ విరామంలో నేను ఎక్కడ కనిపించినా భయపడి ఇళ్లల్లోకి వెళ్లిపోయే వారని ఆయన చెప్పారు. ఆ రోజుల్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ తో రేప్ సీన్స్ లో నటించానని ఆ తర్వాత వారు బాలీవుడ్ కి వెళ్లి అమితాబచ్చన్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి లాంటి హీరోలతో నటించి సక్సెస్ అయ్యారని.. మామూలు రౌడీ పాత్రల నుంచి సబ్ విలన్, విలన్ గా అనేక సినిమాలో నటించాను.
ఆ తర్వాత 1996లో వచ్చిన “నిన్నే పెళ్ళాడుతా” చిత్రం లో ఓ సాఫ్ట్ ఫాదర్ రోల్ లో కనిపించాను. ఆ తరువాత నుంచి ఇక నేను అలాంటి పాత్రల్లో నటించడం మొదలు పెట్టాను. అలా నా రెండో ఇన్నింగ్ ప్రారంభమైందని ఆ ఇంటర్వ్యూలో చలపతిరావు చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం చివరి దశలో సినీ మహారధులు ఒక్కొక్కరుగా సినీ పరిశ్రమకు దూరమవ్వడం సినీ పరిశ్రమకు ఒక లోటుగా పేర్కొనవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…