Featured

Big Boss Finale : బ్రీఫ్ కేసు తీసుకుని బయటకి వచ్చిన ఆరియానా ఎంత గెలుచుకుందో తెలుసా?

Big boss finale : బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను అలరిస్తోంది. అన్ని భాషలలోనూ హిట్ షో గా నిలిచిన బిగ్ బాస్ ఇపుడు కొంచెం మారి సరికొత్తగా నాన్ స్టాప్ బిగ్ బాస్ గా వస్తోంది. ఇక హిందీ లో ఆల్రెడీ వచ్చేసిన ఈ సరికొత్త బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు ఈ సీజన్ తో పరిచయమైంది. ఇక ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఫైనల్ మే 21 న జరిగి ఆడపులి బిందు మాధవి టైటిల్ గెలిచింది. ఇక మరోసారి అఖిల్ సార్థక్ రన్నర్ గా మిగిలాడు.

బ్రీఫ్ కేసు తీసుకున్న అరియనా…..

ఇక టాప్ 4 లో మిగిలిన బిందు, అఖిల్, అరియనా, యాంకర్ శివల మధ్య టైటిల్ వార్ గట్టిగానే జరిగింది. ఇక బిగ్ బాస్ లో సందడి చేయడానికి మేజర్ టీం, f3 సినిమా బృందాలు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే బ్రీఫ్ కేసు ఆశ చూపి డ్రాప్ అవ్వమనే కాన్సెప్ట్ ను పెట్టారు. ఇక f3 నుండి డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్ వచ్చారు. వీరిద్దరూ వారి టైమింగ్ పుంచులతో అలరించారు. ఇక బ్రీఫ్ కేసు తీసుకుని హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. అఖిల్ నేను ఉపయోగం కోసం వచ్చానని చెప్పగా, బిందు తెలుగు వాళ్ళకి దగ్గరవ్వడానికి వచ్చానని చెప్పింది. ఇక అరియనా మాత్రం డబ్బు కోసం వచ్చానని, ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇక యాంకర్ శివ కుడా తన ఆర్ధిక కష్టాలు తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు కానీ కప్ గెలవాలనుకుంటున్నట్లు వివరించాడు.

దొంగ సచ్చినోళ్ళు నన్ను మోసం చేసారు….

ఇక డబ్బుల బేరం మొదలు పెట్టగానే, బ్రీఫ్ కేసు లో డబ్బు ఎంత ఉండొచ్చు అని అరియనా ఆరాలు తీసింది. కానీ అనిల్, సునీల్ మాత్రం గుట్టు బయట పెట్టలేదు. ఇక ఖచ్చితంగా లక్షలు ఉన్నాయని భరోసా ఇవ్వడంతో డబ్బు తీసుకోడానికి సిద్ధమైంది అరియనా. స్టేజి పైకి వచ్చాక అరియనా ను అనిల్, సునీల్ ఆదుకున్నారు. డబ్బు ఉందంటే ఎలా నమ్మావు అంటూ ఏడిపించగా దొంగసచ్చినోళ్లు నమ్మించారు అని అనిల్, సునీల్ లను తిట్టేసింది. ఫైనల్ గా బ్రీఫ్ కేసులో పది లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో హ్యాపీ అయింది అరియనా. ఇక బాబా భాస్కర్, నాగార్జున, అనిల్, సునీల్ అరియనా తో ఆడుకున్నారు ఇక ఫైనల్ గా మొదటి సారిగా తెలుగు బిగ్ బాస్ లో అమ్మాయి కప్ గెలిచింది. బిందు మాధవిని ఆడపులి అంటూ నెట్టింట్లో ఆమె అభిమానులు హంగామా చేసారు. అఖిల్ రెండో సారి రన్నర్ అప్ గా మిగిలాడు. యాంకర్ శివ టాప్ 3 గా నిలిచాడు.

Bhargavi

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

18 hours ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

18 hours ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

19 hours ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

19 hours ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

19 hours ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

19 hours ago