Big boss Keerthi bhat : బిగ్ బాస్ సీజన్ 6 కాంటెస్టంట్ గా అడుగుపెట్టిన కీర్తి జీవితం ఒక విషాదం. ఎవరికైనా జీవితంలో అనుకోని కష్టాలు కామన్ కానీ కీర్తికి కష్టాలే జీవితం అయిపోయాయి. ధర్మస్థలం వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్న వదిన వాళ్ళ పాప అందరినీ కోల్పోయింది కీర్తి. ఇక తండ్రి మరణం తట్టుకోలేక కోమాలోకి వెళ్ళి 32 రోజులు కోమాలో ఉండి ఆ తరువాత కోలుకున్నాక బంధువులతో ఆస్తి తాగదాలు. కీర్తి ఈ కష్టాలను దాటుకుని కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆ తరువాత హెచ్ఆర్ గా ఒక కంపెనీ లో పనిచేస్తూ తండ్రి కోసం ఒక పాపను దత్తత తీసుకుంది. అయితే బిగ్ బాస్ కి వచ్చే ముందు ఆ పాప మరణించింది. అలా జీవితములో కష్టాలనే చూస్తూ వచ్చిన కీర్తి జీవితంలో వెలుగొచ్చింది.

బుల్లితెర మీద ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి, కార్తీక్…
కీర్తి జీవితంలో నేడు కొత్త అధ్యాయం మొదలయింది. కన్నవాళ్లు, పెంచుకున్న పాప ఇలా అందరూ దూరం అయిన పోరాడుతునే జీవిస్తున్న కీర్తికి తోడుగా జీవితాంతం ఉంటానంటూ కార్తీక్ నిలబడ్డాడు. నటుడు విజయ్ కార్తీక్ తోట తో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ను మా టీవిలో చేయగా ఈ వేడుకకు సంబంధించిన ప్రోమోలో కీర్తి, కార్తీక్ దండలు మార్చుకున్నారు. ‘నీకు నేను తోడుగా ఉంటాను, నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా, నన్ను వదలకుండా ఇలాగే చూసుకో’ అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి చెబుతూ.. ‘నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు నీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నువ్వు మా బిడ్డ అనుకుంటాం. మనం ఒక పాపను దత్తత తీసుకుందామని చెప్పారంటూ భావోద్వేగానికి గురైంది కీర్తి.

గతంలో ఆక్సిడెంట్ వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేని కీర్తి పాపను దత్తత తీసుకుంది. అయితే ఆ పాప మరణించడంతో బాగా క్రుంగిపోయింది. ఇక కీర్తి కాబోయే భర్త విజయ్ కార్తిక్ తొలుత కన్నడ సినిమాల్లో హీరోగా చేసారు. ఆపైన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తను పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ లో బిజీగా ఉన్న కార్తీక్ త్వరలో కీర్తి ని పెళ్లి చేసుకోబోతున్నారు.





























