బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది. ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అవుతూనే ఆర్జే చైతూ తర్వాత బయటకి వచ్చేది నువ్వే అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ముమైత్.
ఇక రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా తాము ఎవరినినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి ఫోటోపై డ్యాగర్ గుచ్చి.. ఎందుకు నామినేట్ చేస్తున్నామనే దానిపై తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు.
ఇక ఎలిమినేషన్ అనగానే ఎప్పటిలానే రెచ్చిపోయే మన కంటేస్టంట్స్ ఈసారి కూడా అరుపులు, గొడవలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే ఒక అర్హత కావాలి శివ కి ఆ అర్హత లేదు అంటూ శివని నామినేట్ చేసాడు అఖిల్. ఇక మరో మరో కంటేస్టంట్ సరయూ కూడా శివ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తున్నాడంటూ నామినేట్ చేసింది.
ఈ నేపధ్యంలో శివ మాట్లాడుతూ నేను ఏమి డబుల్ మీనింగ్ మాట్లాడను అంటూ ప్రశ్నించగా నటరాజ్ మాస్టర్ కలుగజేసుకుని “నీ పిండి నేను పిసకలేను కానీ పిసికే వాడిని పిలుస్తా” అని అన్నావ్ అది డబుల్ మీనింగ్ డైలాగ్ కాదా అంటూ సరయు ని సపోర్ట్ చేసాడు.. దీనిపై శివ స్పందిస్తూ అసలు నేను ఆ డైలాగ్ అనలేదు.. ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడాను అని ఒక్క విడియో చూపిస్తే ఎలిమినేషన్ కూడా లేకుండా తక్షణం నేను బయటకి వెళ్ళిపోతా అంటూ చాలెంజ్ చేసాడు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…