Big Boss Season 6 : అన్ని భాషలలోనూ విజయవంతం అయిన బిగ్ బాస్.. తెలుగులో ఇప్పటికే అయిదు సీజన్లు ఘనంగా పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది. ఆరవ సీజన్ మొదలు అయ్యి రెండు వారాలు కూడా పూర్తి చేసుకుంది. 21 మంది కంటెస్టెంట్లతో మొదలు అయిన సీజన్6 మొదటివారం కాస్త చప్పగానే సాగింది. మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా జరగలేదు. రెండవ వారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం, నాగార్జున రిలాక్స్ అవ్వడానికి వచ్చి ఉంటే బయటకు వెళ్లొచ్చు అని హెచ్చరించడంతో ఆట తీరు కాస్త మారింది.
బూతులు మొదలు పెట్టిన గీతు రాయల్…
చిల్ అవ్వడానికి రాలేదు.. అని నాగార్జున అనడంతో అందరికీ గొడవ పడమని హింట్ ఇచ్చినట్టుగా అయింది. దాంతో ఇంతవరకు ఉన్న చిన్న చిన్న గొడవలు మూడోవారం ఎలిమినేషన్స్ లో పెద్ద గొడవలుగా మారాయి. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో చలాకి చంటి పదిమందితో కలిసి ఉంటున్నప్పుడు సంస్కారంతో ఉండాలని చెప్తూ గీతు ని నామినేట్ చేసాడు. అందుకు గీతు ముందు మీకు సంస్కారం ఉందో లేదో చూసుకోండి అని గొడవ పెట్టుకుంది. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ కాదని దీటుగా చంటి సమాధానం ఇవ్వగా.. నాకు తీట లేదు అందరితో గొడవ పెట్టుకోవడానికి అని గీతు అనింది.
తరువాత ఇనయా కూడా గీతు ఆట ఫెయిర్ గా లేదని నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందో చెబుతూ.. ఎవరు ఏమి చెప్పిన వినకుండా విషయాన్ని సాగదీస్తుందని, తన బట్టలు పెట్టుకొనే రాక్ కూడా లాక్కుందని చెప్పింది. ఇనయా మాట్లాడే వరకు చాలా ఓపికగా ఉన్న గీతు తన అవకాశం రాగానే ఇనయా ను ‘ఇక్కడి నుండి దొబ్బెయ్ దొబ్బెయ్’ అంటూ వెటకారంగా మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్ లో అందరూ మాట్లాడిన మాటలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి సాధారణ మాటలే అయినా షో లో ఇలాంటి మాటలు బాగోలేవని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…