Featured

Vijaya Shanti : నా బ్యాచ్ హీరోలందరూ ముసుగు దొంగలే..వీరంతా సినిమాల్లోనే హీరోలా.? బయట కాదా.?! : విజయశాంతి

Vijaya Shanti : జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కథానాయిక వేషాలే వరించాయామెని.

ఈ మధ్య కాలంలో(1979-83) ఆమె తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సుమన్ రాజశేఖర్ లాంటి హీరోలు అందరితో విజయశాంతి కలిసి నటించారు. అందులో అనేక చిత్రాలు మంచి విజయాన్ని సాధించి విజయశాంతికి ఎంతో పేరు తీసుకొచ్చాయి.

విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీ లో చేరింది…

తాను రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు చేస్తున్నప్పుడు తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంది. మీరు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. దానికి తెలంగాణ ప్రజలు కారణం కాదా?.. మీ స్పందన తెలియజేయండి, మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్క హీరో కూడా సమాధానం చెప్పలేదు. మీ బ్యాచ్ హీరోలు భయపడ్డారా అని యాంకర్ అడగగా.. కాదు మా బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు.. వారు తీసుకుంటున్న పారితోషికములో 50% పక్కన పెట్టండి కనీసం 20% కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వాళ్లు కేవలం సినిమాలోనే హీరోలు బయట కాదా.? కనీసం దండేసి అభినందిద్దాం అనే హీరో ఒక్కరైనా ఉన్నారా?… ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం మంచి విజయం సాధించిన తర్వాత కూడా సినిమాలను పక్కకు పెట్టి ప్రజల కొరకు రాజకీయాల్లోకి వచ్చానని తాను అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేదాన్నని ఆ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలుగు హీరోలపై కాస్త ఘాటుగానే స్పందించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago