Featured

Puri Jagannath : నేను తీసిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను పవన్ కళ్యాణ్ వదులుకున్నాడు.. అసలు ఎందుకలా చేసాడో ఇప్పటికీ అర్థం కాలేదు. : పూరి జగన్నాథ్.

పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు.
అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో.. పూరి, రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక తెలుగు చిత్రాలకు ప్రధానంగా యాక్షన్ జానర్‌లో పనిచేశారు. ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియురాలితో ఒక పందెం కాస్తాడు అనే కాన్సెప్టుతో పూరి జగన్నాథ్ ఒక కథ రాసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాలని పూరి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాను రూపొందించి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఈ సినిమా అనంతరం.. మూడు బ్లాక్ బస్టర్ సినిమా కథలను పవన్ కళ్యాణ్ కు వినిపించాడు.

“ఇడియట్” పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ,రక్షిత, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. “ఓ చంటి గాడి ప్రేమకథ” అన్నది సినిమాకి ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ
సినిమాలో కథానాయకునిగా పవన్ కల్యాణ్ ని కూడా సంప్రదించారు. కానీ అది కూడా కుదర్లేదు. తర్వాత పూరీజగన్నాథ్ రవితేజని ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు ఎంచుకున్నారు.

“అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, అసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. 
చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇడియట్ చిత్ర విజయం తర్వాత పూరి ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించారు. కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత..

2006 వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ నిర్మాణం,పూరిజగన్నాథ్ దర్శకత్వంలో “పోకిరి” సినిమా విడుదలయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటించారు. దాదాపు ₹ 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం. థాయిలాండ్ మరియు బ్యాంకాక్ నగరంలో పాటల చిత్రీకరణ కొనసాగింది.ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా కథను ముందుగా పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కి వినిపించారు. అయితే దర్శకుడు పూరి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రూపొందించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్, పోకిరి చిత్రాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్ కి వినిపించానని ఆయన కథలను ఓపికతో విన్నారు. కానీ సినిమా చేస్తాను లేదా చేయను అనే విషయం చెప్పలేదని.. నేను చెప్పిన స్టోరీస్ పవన్ కళ్యాణ్ కి నచ్చాయో లేదో ఇప్పటికీ తెలియదని ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago