పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు.
అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో.. పూరి, రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక తెలుగు చిత్రాలకు ప్రధానంగా యాక్షన్ జానర్‌లో పనిచేశారు. ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియురాలితో ఒక పందెం కాస్తాడు అనే కాన్సెప్టుతో పూరి జగన్నాథ్ ఒక కథ రాసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాలని పూరి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాను రూపొందించి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఈ సినిమా అనంతరం.. మూడు బ్లాక్ బస్టర్ సినిమా కథలను పవన్ కళ్యాణ్ కు వినిపించాడు.

“ఇడియట్” పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ,రక్షిత, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. “ఓ చంటి గాడి ప్రేమకథ” అన్నది సినిమాకి ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ
సినిమాలో కథానాయకునిగా పవన్ కల్యాణ్ ని కూడా సంప్రదించారు. కానీ అది కూడా కుదర్లేదు. తర్వాత పూరీజగన్నాథ్ రవితేజని ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు ఎంచుకున్నారు.

“అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” 2003 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, అసిన్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు.
చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇడియట్ చిత్ర విజయం తర్వాత పూరి ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించారు. కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత..

2006 వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ నిర్మాణం,పూరిజగన్నాథ్ దర్శకత్వంలో “పోకిరి” సినిమా విడుదలయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటించారు. దాదాపు ₹ 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం. థాయిలాండ్ మరియు బ్యాంకాక్ నగరంలో పాటల చిత్రీకరణ కొనసాగింది.ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా కథను ముందుగా పూరీ జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కి వినిపించారు. అయితే దర్శకుడు పూరి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రూపొందించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్, పోకిరి చిత్రాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్ కి వినిపించానని ఆయన కథలను ఓపికతో విన్నారు. కానీ సినిమా చేస్తాను లేదా చేయను అనే విషయం చెప్పలేదని.. నేను చెప్పిన స్టోరీస్ పవన్ కళ్యాణ్ కి నచ్చాయో లేదో ఇప్పటికీ తెలియదని ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.































