Featured

Prabhas : పెదనాన్న కోసం సొంతూరు వెళ్లనున్న ప్రభాస్, దాదాపు 12 ఏళ్ల తరువాత మొగల్తూరు కి ప్రభాస్..!

Prabhas : సెప్టెంబర్ 11 న కృష్ణం రాజు గారు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించడం అందరికీ తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లోనే ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. ఇక ఆయన దశ దిన కర్మ ను ఈ నెల 23 న హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించాలని అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యామిలీ. ఇక ఆయన సంస్మరణ సభను మాత్రం కృష్ణం రాజు గారి సొంతూరు మొగల్తూరు లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఆ సభకు ప్రభాస్ ఫ్యామిలీ అంతా వస్తారని సమాచారం. దాదాపు 12 ఏళ్ల తరువాత ప్రభాస్ సొంతూరుకి పెదనాన్న వల్ల రాబోతున్నాడు.

70,000 మందికి భోజనాలు…

సెప్టెంబర్ 28 న కృష్ణం రాజు గారి సంస్మరణ సభ మొగల్తూరు లోని ఆయన నివాసం వద్ద జరపాలని అనుకుంటున్నారు. 2010 లో ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు గారి తమ్ముడు మరణించినపుడు ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ తరువాత మళ్ళీ వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పెదనాన్న కోసం 12 ఏళ్ల తరువాత వెళ్లాలని అనుకుంటున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

వారి పూర్వికుల నివాసం వద్ద ఇంటికి రంగులు పూయించడం, ఫర్నిచర్ మార్చడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక 70 వేల మందికి భోజనాలు పెట్టాలని అనుకోవడం వల్ల ద్రాక్షారామం నుండి వంటవాళ్ళను కూడా పిలిపించారు. కృష్ణం రాజు గారు బ్రతికి ఉన్నపుడు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లైనా మొగల్తూరు వెళ్ళి వచ్చేవారట. కరోనా లాక్ డౌన్ వల్ల గత రెండేళ్లుగా ఆయన  మొగల్తూరు వెళ్ళలేదు. ఈ నెల 23 న దశదిన కర్మ అనంతరం 28 న సంస్మరణసభ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరగనుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago