బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా రన్ అవుతోంది. మూడు వారాలు పూర్తి చేసుకొని.. ముగ్గురిని బయటకు పంపించి ఇక మిగిలిన 16 మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం హౌస్ నడుస్తోంది. ఇప్పటికే లావుతగ్గాల్సిందే అన్న టాస్క్ లో భాగంగా ఇద్దరు కలిసి ఒక జంటగా ఏర్పడి టాస్క్ లు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో లావు తగ్గాలన్నా కాన్సెప్ట్ తో మొదట టాస్క్ మొదలైన విషయం కూడా విధితమే.
ఇందులో ఇప్పటికే ఆకలికి తట్టుకోలేక చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా లోబో పరిస్థితి చూస్తే.. చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. ఈ టాస్క్ లో భాగంగానే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులను ఆకలితో అలమటించేలా చేశాడు. ఆకలి బాధ అంటే ఎంటో ఇంట్లో సభ్యులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. ఆకలి బాధను తట్టుకుని ఎవరు నిలబడతారో పరీక్షించాడు.
మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ఇంటి సభ్యులకు ఫుడ్ కట్ చేసి.. ఆకలి బాధ అంటే ఎంటో రుచి చూపించాడు. ఇలా టాస్క్ ల మధ్యలో అప్పుడప్పుడు ఫుడ్ పంపించి అందులో ఉన్న వారికి కాస్త ఆకలి తీరుస్తున్నాడు. దీనిని చూస్తుంటే నిన్న చాలామంది ఆకలితో అలమటించినట్లు అనిపించింది. ఇదంతా ఇలా ఉండగా.. నటరాజ్ మాస్టర్ టీంలో ఉన్న లోబో ఆకలికి తట్టుకోలేక.. చెత్త కవర్లో దాచి పెట్టిన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేశాడు..ఎవరూ చూడకుండా అందులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు.
అయితే ఆ విషయాన్ని రవి పసిగట్టి.. రేయ్ ఏం చేస్తున్నావ్ రా అని వారించాడు. అయితే సీన్ చూసిన నటరాజ్ మాస్టర్ ఇలా చేయొద్దు నేను గేమ్ వదిలేస్తున్నా నువ్ తినెయ్ అని చెప్పాడు. ఇది బయట నుంచి చూసిన ప్రేక్షకులకు ఎంతో బాధ వేసింది. ఇలాంటి టాస్క్ లు పెట్టకుండా ఉండటమే మంచిది అంటూ బిగ్ బాస్ ను నెటిజన్లు వేడుకున్నారు.
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…
వర్చువల్ రియాలిటీ (VR) అంటే ఇప్పటివరకు ఎక్కువ మందికి గుర్తొచ్చేది వీడియో గేమ్స్ లేదా యువత వినోదం మాత్రమే. అయితే…