బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్ను మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూస్తుంటే వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ నడుస్తోందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఎపిసోడ్ లో భాగంగా ఏకంగా సిరి షణ్ముఖ్ కి ముద్దు పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఉన్నఫలంగా షణ్ముఖ్ కి సిరి ముద్దు పెట్టడం, షన్ను కెమెరాల వంక చూస్తూ బాగా రికార్డు చేశారా నాకు ఉంటుంది అంటూ ముసిముసినవ్వులు నవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరి ఆల్రెడీ శ్రీహాన్ తో నిశ్చితార్థం జరుపుకొని ఇలా ముద్దులు పెట్టడం ఏంటి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే శ్రీహాన్ సోషల్ మీడియా వేదికగా సిరి షన్నూకి పెట్టిన ముద్దు విషయంపై స్పందిస్తూ.. ఇప్పుడేఏంట్రా నేను ఏడువాలా? షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో ఇలా ముద్దు సీన్లు ఉంటే మీకు ఓకే కదా.. అంటూ శ్రీహన్ తన ఇన్ స్టోరీలో రాసుకొచ్చారు. ఇలా సిరి ముద్దు విషయం పై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో శ్రీహాన్ ఈ విధంగా స్పందించారు.
ఈ క్రమంలోనే సిరి గురించి శ్రీహాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెపై ట్రోల్ చేస్తున్న వాళ్లకు శ్రీహాన్ ఇలా సమాధానం చెప్పారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా కెప్టెన్ టాస్క్ లో సిరి షన్నుకి సపోర్ట్ చేస్తూ అతనిని కెప్టెన్సీ టాస్క్ లో గెలిచేలా చేసింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…