బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రేక్షకుల్లో ఎంత మంచి ఆదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న ఆర్టిస్టులకు మబచి5గుర్తింపు రావడంతో పాటు..చాలామందికి సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఇక బిగ్ బాస్ నాల్గవ సీజన్ కు సైతం మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.. ఈ సీజన్లో పాల్గొన్న వారిలో అరియానా గ్లోరీ’ కూడా ఒకరు.. మొదట యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అరియనా..
బిగ్ బాస్ లోకి వెళ్లి ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక, ఆమె హీరోయిన్ గా కూడా మారబోతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ, సడెన్ గా ఆమె గురించి ఇప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అరియానా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.ఇప్పటికే ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయిందనే వార్త వైరల్ అవుతుంది. అయితే, హీరోయిన్ అవుతుందని అనుకున్న ఆమె, మిస్ అరియానా నుండి మిసెస్ అరియానాగా మారబోతోందా అంటూ సోషల్ మీడియా ఆమె పెళ్లి పై డిస్కషన్ మొదలైపోయింది.
మరి ‘అరియానా గ్లోరీ’ నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా ? అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అని ఎంక్వైరీ చేస్తే.. అసలు నిజం బయట పడింది.ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మరి ఎందుకు ఈ వార్త పుట్టింది అంటే.. అరియనా ఒక గోల్డ్ జువెల్లర్ బ్రాండ్ కోసం రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. కాగా ఆ కమర్షియల్ యాడ్ కోసం అరియనా పెళ్లి కూతురు గెటప్ లో దర్శనం ఇవ్వాల్సి వచ్చింది.
ఆ రకంగా అరియనా పెళ్లి కూతురిగా కనిపించింది.అలా ఆ పెళ్లి కూతురు గెటప్ లో తానూ దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అరియానా. దాంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలన చూసిన గాసిప్ రాయుళ్లు పై విధంగా ఒక పుకారును షికారు అయ్యేలా వైరల్ చేశారు..కానీ చివరికి అదంతా పుకార్లే నని..ఆమె పెళ్లి వార్తలో ఎటువంటి నిజాలు లేవని తేలింది…!!
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…