బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాలుగు వారాలను పూర్తి చేసుకుని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 15 మంది సభ్యులతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతారు. ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి, శ్వేత, ప్రియా, అనీ మాస్టర్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. మొదట్లో కెప్టెన్సీ టాస్క్ లకు ప్రియాను అనర్హులుగా ప్రకటించిన బిగ్ బాస్ ఆమెకు ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
మొదట కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నటువంటి హమీద ఈ టాస్క్ నుంచి తప్పుకోవడంతో ప్రియకు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పది వేళ్ళు సరిపోవు సోదరా.. అనే టాస్క్ లో భాగంగా వాటర్ డ్రమ్స్ కి హోల్ చేసి ఉంటారు. బజర్ మోగగానే ఆ హోల్స్ కి ఉన్నటువంటి ప్లాస్టిక్ స్టిక్కర్స్ తీసేసి నీటిని పోకుండా ఆపాలి. టాస్క్ పూర్తయ్యేలోగా ఎవరి డ్రమ్ లో ఎక్కువ వాటర్ ఉంటే వారు కెప్టెన్ అని బిగ్ బాస్ తెలియజేశారు.
అయితే కెప్టెన్సీ టాస్క్ ఈ రోజు ప్రసారం కానున్న ప్పటికీ ఎవరు కెప్టెన్సీలో గెలుస్తారనే విషయాన్ని బిగ్ బాస్ లీక్ చేశారు. ఈ క్రమంలోనే నేడు ప్రసారం కాబోయే బిగ్ బాస్ ప్రోమో విడుదల చేయడంతో అందులో కంటెస్టెంట్ ప్రియా చేతికి కెప్టెన్సీ బ్యాండ్ ఉండడంతో కెప్టెన్సీ టాస్క్ లో ప్రియ గెలిచి ఈ వారం హౌస్ కెప్టెన్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈక్రమంలోనే వరెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది హౌస్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో ప్రియ చేతికి ఉన్న కెప్టెన్స్ బ్యాండ్ మనం చూడవచ్చు. ఇక ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? ఎవరు జైలుకు వెళ్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…