తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు గొడవలు జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు,ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడి ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో మా సభ్యుల మధ్య టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మెగా కుటుంబం మద్దతు ఉందని నాగబాబు తెలియజేస్తూ మంచు ప్యానెల్ పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నటీనటులు మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పూర్తి మద్దతు మంచు విష్ణుకి ఉందని, ఈ ఎన్నికలలో పోటీ చేసి అధ్యక్ష పదవిలో కొనసాగడానికి మంచు విష్ణు పూర్తిగా అర్హుడని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలిపారు.ఇకపోతే ప్రకాష్ రాజ్ గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ తో కలిసి తాను 15 సినిమాలకు పైగా నటించానని అయితే ఏ సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రకాష్ రాజ్ సమయానికి సెట్ కి వచ్చే వాడు కాదని, ఇలాంటి క్రమశిక్షణ లేని వారు మా అధ్యక్ష పదవికి అనర్హులు అంటూ ప్రకాష్ రాజ్ గురించి కోట శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…