Movie News

తల్లి కావడానికి సిద్ధమైన సమంత… కానీ అంతలోనే ఇలా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నీలిమ గుణ..!

సమంత నాగ చైతన్యల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నామని చెప్పి దాదాపు వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ వీరిద్దరి విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు.ఈ క్రమంలోనే విడాకుల తర్వాత తన విడాకుల విషయమై నాగచైతన్య ఏమాత్రం స్పందించకపోగా సమంత మాత్రం తన విడాకుల విషయమై ఘాటుగా స్పందించారు.

విడాకులు తీసుకుని విడిపోవడంతో ప్రతి ఒక్కరు తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయించుకున్నాను అని మాట్లాడుతున్నారు. విడాకుల బాధ నుంచే తను బయట పడలేని స్థితిలో ఉన్న తనపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరింత బాధ పెట్టారని ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా సమంత తల్లి కావడం గురించి యువ నిర్మాత నీలిమ గుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అసలు సమంత తల్లి కావడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదిస్తే సమంత వారికి కొన్ని కండిషన్లు పెట్టిందని తెలియజేశారు.తాను సినిమాల్లో నటించాలనుకోవడం లేదని తను ప్రస్తుతం ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండటం వల్ల పూర్తి సమయం కుటుంబంతో గడపాలని భావించినట్లు చెప్పారని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.

అయితే పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాలో నటించడానికి సమంత కొన్ని కండిషను పెట్టింది. సినిమాను వీలైనంత వరకు ఆగస్టు చివరి కల్లా పూర్తి చేసేలా ఉంటేనే తను సినిమాకు ఒప్పుకుంటానని లేకపోతే ఈ సినిమాలో నటించలేననే ఆ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే సమంత చెప్పిన విధంగానే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేస్తామని మాట ఇవ్వడంతోనే సమంత శాకుంతలం సినిమాలో నటించిందని తెలిపింది.

సమంత తనకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతోనే పిల్లలను కనడానికి సిద్ధమైందని అయితే అనుకోకుండా ఈ విధంగా విడాకులు తీసుకోవడంతో సమంత వైపు నుంచి ఏ మాత్రం తప్పులేదని తెలుస్తోంది. మరి సమంత నాగ చైతన్యల విడాకుల విషయంలో ఏం జరిగింది… తప్పు మొత్తం అక్కినేని కుటుంబానిదేనా.. వీరు విడాకులకు కారణం ఏమై ఉంటుంది అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago