Movie News

తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకు తీవ్ర వివాదం లేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి ప్యానెల్ సభ్యులపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున మెగా బ్రదర్ నాగబాబు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో మంచు ప్యానెల్ సభ్యులపై షాకింగ్ కామెంట్ చేశారు.

దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని, ప్రకాష్ రాజ్ కు విష్ణుతో అసలు పోలికలు లేవని ఆయన ఆరోపించారు. మోహన్ బాబు విద్యాసంస్థలను నడపటం వల్ల విద్యార్థులకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అదే ప్రకాష్ రాజ్ ఓ మంచి నటుడిగా నటీనటులకు ఏం కావాలో తనకి తెలుసని నాగబాబు తెలిపారు. ఇక నిర్మాతలతో కేవలం ప్రకాష్ రాజ్ కు మాత్రమే కాకుండా, మంచు కుటుంబానికి కూడా విభేదాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగబాబు గుర్తు చేశారు.

ఇక మా ఎన్నికలలో లోకల్ నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని అసలు తెలుగు పరీక్ష పెడితే విష్ణుకి పాస్ మార్కులు కూడా రావని ఈ సందర్భంగా నాగబాబు మంచు విష్ణు పై విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ ను ప్రతి ఒక్కరు తెలుగోడని భావిస్తారు, అదే మంచు విష్ణుకు తెలుగు నేర్చుకోమని చెబుతారు. ఎంతో విజ్ఞానం, సినిమా జ్ఞానం ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కి తన మద్దతని మరోసారి నాగబాబు తెలిపారు.

ఇలా ఒకరి ప్యానల్ సభ్యుల గురించి మరొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ మా ఎన్నికల గురించి ఉత్కంఠతను రేపుతున్నారు. మరి 10వ తేదీ జరగబోయే ఎన్నికలలో మా అధ్యక్ష పదవిని ఎవరు దక్కించుకుంటారు అధ్యక్ష పీఠంపై ఎవరు ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago