Featured

పురాణాలు చెపితే వినని జనాలు పైట జారిస్తే సొల్లు గారుస్తున్నారు.?!

విజయనగరం జిల్లాలో ఒక మామూలు తబలా వాయిద్యకారి, హరికథ పరాయణుడి కుమార్తె కరాటే కళ్యాణి. ఆయన ఊళ్లు తిరుగుతూ హరికథలు చెబితే వచ్చిన డబ్బులతో పిల్లల బడి ఫీజు కట్టి పిల్లల్ని పోషించేవాడు. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన కళ్యాణి చిన్నప్పటినుంచే కవితలు రాయడం, పెయింటింగ్స్ వేయడం అలా తర్వాత మెల్లిగా హరికథలు చెప్పడం ప్రారంభించింది. కరాటే కళ్యాణి మంచి వాయిస్ ను కలిగి ఉండటంతో ఆమె హరికథలు చెబుతుంటే ఎంతో వినసొంపుగా ఉంటుంది.

1998 వరకు నేషనల్ లెవల్లో కరాటే కాంపిటీషన్ లో పాల్గొని మెడల్ సాధించింది. ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్ లో పాల్గొనడానికి అవకాశం వచ్చినా అనివార్య కారణాల వలన కళ్యాణి వెళ్లలేకపోయింది. కళ్యాణి ప్రేమ వివాహం విషాదకరం అందుకే ఆమె పెళ్లిమాట వస్తే చీదరించుకుంటుంది. 136 గంటల పాటు హైదరాబాద్ లో హరి కథలు చెబుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లోకి ఎక్కింది. అయినా జనాల్లో అంతగా ఆమెకు గుర్తింపు రాలేదు.

2001 సంవత్సరంలో “వేచి ఉంటా” అనే సినిమాలో ఆమె మొదటగా నటించారు. ఆ తర్వాత ఆది,  శంకర్ దాదా ఎంబిబిఎస్, కృష్ణ, చత్రపతి, నవ్వులేనవ్వులు, మిరపకాయ్, లీలామహల్ సెంటర్, గుంటూరు టాకీస్, నేను లోకల్, గౌతమ్ నంద, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ కృష్ణ సినిమాలో “బాబీ.. అంటూ బ్రహ్మానందం వెనకాల పడే ఒక వ్యాంప్ క్యారెక్టర్ లో ఆమె నటించింది.

అంతకుముందు కరాటే, హరికథలు, పురాణాలు చెబితే రానటువంటి గుర్తింపు సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తాను ఎప్పుడైనా వివిధ షోలకి వెళ్ళినప్పుడు బాబీ అంటూ పిలుస్తున్నారని.. తను వేసిన వ్యాంపు క్యారెక్టర్ ను గుర్తుపట్టి నందుకు సంతోషపడాలా.! అలాంటి క్యారెక్టర్ ఎందుకు వేశానని బాధ పడాలా.! అంటూ కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో వాపోయారు.

telugudesk

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

59 minutes ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

1 hour ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

1 hour ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

1 hour ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

1 hour ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago