విజయనగరం జిల్లాలో ఒక మామూలు తబలా వాయిద్యకారి, హరికథ పరాయణుడి కుమార్తె కరాటే కళ్యాణి. ఆయన ఊళ్లు తిరుగుతూ హరికథలు చెబితే వచ్చిన డబ్బులతో పిల్లల బడి ఫీజు కట్టి పిల్లల్ని పోషించేవాడు. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన కళ్యాణి చిన్నప్పటినుంచే కవితలు రాయడం, పెయింటింగ్స్ వేయడం అలా తర్వాత మెల్లిగా హరికథలు చెప్పడం ప్రారంభించింది. కరాటే కళ్యాణి మంచి వాయిస్ ను కలిగి ఉండటంతో ఆమె హరికథలు చెబుతుంటే ఎంతో వినసొంపుగా ఉంటుంది.

1998 వరకు నేషనల్ లెవల్లో కరాటే కాంపిటీషన్ లో పాల్గొని మెడల్ సాధించింది. ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్ లో పాల్గొనడానికి అవకాశం వచ్చినా అనివార్య కారణాల వలన కళ్యాణి వెళ్లలేకపోయింది. కళ్యాణి ప్రేమ వివాహం విషాదకరం అందుకే ఆమె పెళ్లిమాట వస్తే చీదరించుకుంటుంది. 136 గంటల పాటు హైదరాబాద్ లో హరి కథలు చెబుతూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లోకి ఎక్కింది. అయినా జనాల్లో అంతగా ఆమెకు గుర్తింపు రాలేదు.

2001 సంవత్సరంలో “వేచి ఉంటా” అనే సినిమాలో ఆమె మొదటగా నటించారు. ఆ తర్వాత ఆది, శంకర్ దాదా ఎంబిబిఎస్, కృష్ణ, చత్రపతి, నవ్వులేనవ్వులు, మిరపకాయ్, లీలామహల్ సెంటర్, గుంటూరు టాకీస్, నేను లోకల్, గౌతమ్ నంద, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ కృష్ణ సినిమాలో “బాబీ.. అంటూ బ్రహ్మానందం వెనకాల పడే ఒక వ్యాంప్ క్యారెక్టర్ లో ఆమె నటించింది.

అంతకుముందు కరాటే, హరికథలు, పురాణాలు చెబితే రానటువంటి గుర్తింపు సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తాను ఎప్పుడైనా వివిధ షోలకి వెళ్ళినప్పుడు బాబీ అంటూ పిలుస్తున్నారని.. తను వేసిన వ్యాంపు క్యారెక్టర్ ను గుర్తుపట్టి నందుకు సంతోషపడాలా.! అలాంటి క్యారెక్టర్ ఎందుకు వేశానని బాధ పడాలా.! అంటూ కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో వాపోయారు.






























