Priyanka Jain: ప్రియాంక జైన్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై మౌనరాగం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా జానకీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా ఈమెకు భారీ స్థాయిలో అభిమానులు పెరగడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశం వచ్చింది.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఫినాలే వరకు వెళ్లి టాప్ ఫైవ్ కటేస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈమె నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉండటమే కాకుండా ఆయనతో ఇదివరకే నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు బిగ్ బాస్ హౌస్ లోకి ఆయన వెళ్లినప్పుడు మనం పెళ్లి చేసుకుందామా అంటూ ప్రియాంక అడగక బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకుందామంటూ శివకుమార్ కూడా తెలిపారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈమె పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే తాజాగా తన పెళ్లి గురించి శివకుమార్ ప్రియాంక ఇద్దరు కూడా క్లారిటీ ఇస్తూ తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ మీ పెళ్లి ఎప్పుడు అంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు అయితే మేము 2024 లోనే పెళ్లి చేసుకుంటామని తెలిపారు.
వచ్చే ఏడాదే మా పెళ్లి…
త్వరలోనే మా పెళ్ళికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా తెలియజేస్తామని ప్రియాంక వెల్లడించారు. ఇకపోతే చాలామంది ఈమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జుట్టు కత్తిరించుకోవడం గురించి కూడా ప్రశ్నలు వేయగా నా జుట్టు పెరిగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…