Maanas: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెరపై పలు సినిమాలలో హీరోగా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నటువంటి నటుడు మానస్ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా వెండి తెరపై తనకు కలిసి రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలలో బిజీ అయ్యారు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమా ద్వారా ఫినాలే వరకు వెళ్లినటువంటి మానస్ విన్నర్ గా నిలవలేకపోయారు. ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నవంబర్ 23వ తేదీ మానస్ శ్రీజ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇలా పెళ్లి తర్వాత ఈయన తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఇకపోతే ఇటీవల మానస్ కొత్త కారును కొనుగోలు చేశారు అంటూ ఈయన తన కొత్త కారుతో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. మానస్ కొనుగోలు చేసిన కారు మెర్సిడేస్ బెంజ్ అని తెలుస్తుంది. ఈయన E220D మోడల్ కారణం కొనుగోలు చేశారట.
90 లక్షలా..
ఇలా తన కుటుంబ సభ్యులందరూ కూడా గుడికి వెళ్లి పూజ చేయించి అనంతరం కారు దగ్గర దిగినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు అయితే ఈ కారు ఖరీదు సుమారు 80 నుంచి 90 లక్షల వరకు ఉంటుందని సమాచారం. నెల రోజుల ముందు ఘనంగా పెళ్లి చేసుకుని నెల తిరగకుండానే మానస్ ఇంత ఖరీదైన కారును కొనడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…