Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుని ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకున్న సినిమాగా సలార్ సినిమా నిలిచింది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ ఆస్తులు విలువ కూడా పెరిగిందని తెలుస్తుంది. తాజాగా ఫోర్బ్స్ జాతీయ మీడియా సర్వే ప్రకారం ప్రభాస్ ఆస్తుల విలువ గురించి ఓ నివేదికను వెల్లడించింది. బాహుబలి సినిమా చేయకముందు వరకు ప్రభాస్ తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకునేవారు అయితే బాహుబలి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగింది తద్వారా ఆస్తుల విలువ కూడా పెరిగిందని తెలుస్తోంది.
అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రభాస్ నికర ఆస్తుల విలువ 145 కోట్లుగా పేర్కొన్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగాయి అని ఫోర్బ్ ఓ కథనాన్ని వెల్లడించింది. 2015 వరకు ఆయన మూడుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 లో ఉన్నారు. ప్రభాస్ కి హైదరాబాద్లో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని తెలుస్తోంది అలాగే ముంబైలో కూడా 10 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తుంది.
30 మిలియన్ డాలర్స్…
ఇలా ఖరీదైన బంగ్లాలతోపాటు కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయట. ఫోర్బ్స్ కంపెనీ లెక్కల ప్రకారం.. ప్రభాస్ నికర ఆస్తుల విలువ 30 మిలియన్ డాలర్లు.. అంటే సుమారుగా 250 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. సలార్ సినిమా తర్వాత ఆయన ఆస్తుల విలువ, ఆదాయం విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…