Yashika Anandh
తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి యాషిక ఆనంద్ తమిళ ప్రేక్షకులను బాగా సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈమెకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఈ నటి ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈమె కారు యాక్సిడెంట్ కి గురవడంతో ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్లు తెలుస్తోంది. అసలు కారు ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే…
నటి యాషిక ఆనంద్ తన ఇద్దరు మగ స్నేహితులతో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కారు తమిళనాడులోని మామల్లపురం సెంటర్ మీడియన్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వల్లిచెట్టి భవానీ అనే మహిళ దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో నటి యాషిక ఆనంద్ తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విధంగా నటి యాషిక ప్రమాదానికి గురైందని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక ప్రమాదంలో మృతి చెందిన మహిళ శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అన్న కోణంలో కేసు విచారణ చేపడుతున్నారు. నటి మద్యం సేవించి వాహనం నడపారా అన్న కోణంలో కూడా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇక నటి యాషిక ఆనంద్ విషయానికి వస్తే మోడల్, టీవీ నటి గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ 2016లో ధురువంగల్ పత్తినారు సినిమా ద్వారా వెండితెరపై తళుక్కుమన్నారు. అదే విధంగా పలు తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ త్రీ లో పాల్గొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…