Categories: FeaturedHealth News

రోజూ గంటల తరబడి టీవీ చూస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

ప్రస్తుతం కరోనా కారణం వల్ల చాలామంది ఇంటికే పరిమితం కావడం వల్ల ఎక్కువ సమయం టీవీల ముందు గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఎక్కువ సమయం పాటు టీవీ చూడటం వల్ల సమస్యలు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు నాలుగు గంటలకు మించి టీవీ చూస్తే మీలో గురక వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 10 నుంచి 18 సంవత్సరాల
1,38,000 మంది పిల్లల పై పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనంలో భాగంగా పిల్లలు ఎక్కువసేపు టీవీ చూస్తూ కూర్చోవడం వల్ల వారిలో స్లీప్ అప్నియాకు దారితీస్తుందని తెలిపారు.

ఈ కారణం వారిలో గురక వ్యాప్తి చెందడానికి కారణమవుతుందని నిపుణులు తెలిపారు. గురక అనేది రాత్రి పడుకున్న సమయంలో వాయు మార్గాలలో ఒక నాళాన్ని పూర్తిగా మూసి వేయడం వల్ల శ్వాస తీసుకోవడానికి మనకు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమయంలోనే గురక అనేది వస్తుంది.అయితే గురక ఎక్కువగా వచ్చే వారు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే క్యాన్సర్, గుండెపోటు, గ్లాకోమా, రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే ప్రతిరోజు టీవీ నాలుగు గంటల కంటే మించి చూడకూడదని, ప్రతిరోజు మన శరీరానికి 30 నిమిషాల పాటు వ్యాయామం ఎంతో అవసరమని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా టీవీ చూసేటప్పుడు చాలామంది రకరకాల చక్కెర పానీయాలు, స్నాక్స్ తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అధిక శరీర బరువు పెరగడం కాకుండా,అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago