తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారం రన్ అవుతోంది. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సారి హౌస్ లో కామెడీ తగ్గిందనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే.. చిన్న చిన్న విషయాలకు ఒకరిపై ఒకరు గొడవపడుతున్న కంటెస్టెంట్స్, టాస్క్ వచ్చేసరికి ఎవరికి వారు తమదైన శైలిలో మంచి ప్రదర్శనను ఇస్తున్నారు.
ఇందులో ఉన్నవాళ్లు కొందరు వైల్డ్ అండ్ అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఉన్నవారిలో కాస్త సాఫ్ట్ కార్నర్ లో షణ్ముఖ్, మానస్ ఉన్నారు. షణ్ముఖ్ ప్లాన్ మాత్రం నాలుగు వారాలు అవుతున్నా ఎవరికీ అర్థం కావడం లేదు. సిరిహన్మంత్ కు మొదటి నుంచి కూడా మంచి ర్యాపో ఉంది.
వీళ్లిద్దరు కలిసి బయట షార్ట్ ఫిలింలు కూడా తీశారు. దీంతోనే షణ్ముఖ్ వెళ్లిన దగ్గర నుంచి సిరితోనే సన్నిహితంగా ఉంటున్నాడు. అదే సమయంలో ఆమె కూడా షణ్ముఖ్ ని వదలడం లేదు. వీళ్లిద్దరిని కొత్త వాళ్లు చూస్తే మాత్రం లవర్స్ అనే భావన కలుగుతుంది.
ఎక్కడ చూసినా వీళ్లిద్దరే సపరేట్ గా కనిపిస్తున్నారు. అంతకముందు జరిగిన సీజన్ల మాదిరిగానే పెయిర్ ను మెయింటెయిన్ చేయాలని అనుకుంటున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా షణ్ముఖ్ ఆటతీరును ఇటు ప్రేక్షకులు, అటు నెటిజన్స్ తప్పుపడుతున్నారు. దీంతో షణ్ముఖ్ కన్నింగ్ మైండ్ తో ఆడుతున్నాడని నెటిజన్లు షణ్ముఖ్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…