తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. కెప్టెన్స్ టాస్క్ గత రెండు రోజుల నుంచి నడిచింది. అందులో ఎట్టకేలకు విశ్వ కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాలుగు గ్రూపులుగా విడదీసిన బిగ్ బాస్ అందులో కాజల్, సిరిలను సంచాలకులుగా వ్యవహరించమన్నారు.
సంచాలకులుగా వాళ్లు వ్యవహరించే తీరు అక్కడ ఉన్న వాళ్లకు అస్సలు నచ్చలేదు. వారిపై విరచుకుపడుతూ కనిపించారు. గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించడంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు.
దీంతో యాంకర్ రవి.. తనకు బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్ టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని లాగేసుకున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. వాళ్లు పిల్లోకు సంబంధించి దూదిని బొమ్మలకు ఉపయోగించారు. దీంతో రవి టీంను బిగ్ బాస్ అనర్హులుగా ప్రకటించాడు. బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన ప్రాపర్టీని ఉపయోగించినందుకు ఆ పనిష్ మెంట్ ఇచ్చారు. వారిని నిలువరించడంలో విఫలమైన కాజల్, సిరిలను కూడా బిగ్ బాస్ అనర్హులుగా తేల్చాడు.
ఇదంతా చూస్తున్న సన్నీ.. యానీ మాస్టార్ ను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. రెడ్ టీంకు ఒక స్పెషల్ పవర్ లభించింది. దీంతో వాళ్లు షణ్ముఖ్ టీమ్ బొమ్మలను సగం చేసేశారు. దీంతో షణ్ముఖ్ టీం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇదంతా ఇలా ఉండగా.. సన్నీ అప్పుడప్పుడు హౌస్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాడు. ఒక ప్రదేశంలో కాజల్ ను ఇమిటేట్ చేస్తూ.. చూపించడం నవ్వులు పూయించింది. అప్పుడప్పుడు సన్నీ పవన్ కళ్యాణ్ డైలగ్స్ చెబుతూ ఆహా అనిపించాడు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…