యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా అప్పుడప్పుడు సెలబ్రిటీల సందడితో కొంత కలర్ ఫుల్ గా నడుస్తోంది. ఈ షో ఓపెనింగ్ కు రామ్ చరణ్ హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాజమౌళి, కొరటాల శివ కలసి ఈ షోలో పాల్గొన్నారు. తర్వాత దసరా సందర్బంగా సమంత ఎపిసోడ్ లో సందడిగా కనిపించింది.
ఆమె ప్రత్యూష ఫౌండేషన్ కోసం డబ్బు గెలుచుకునేందుకు ఆమె ఈ షోకి అతిథిగా పాల్గొన్నట్లు తెలిపింది. ఎన్టీఆర్, సమంత మధ్య వినోదం ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించాయి. ఇలా ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెబుతూ.. చివరకు ఆమె రూ.25 లక్షలు గెలుచుకుంది. ఆ షోలోని ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఆమె కాజల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పొకొచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కాజల్, సమంత హీరోహీరోయిన్లుగా బృందావనం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారివురికి మంచి ర్యాపో ఉంది. ఒకరంటే ఒకరికి మంచి అవగాహన కూడా ఉంది. దీంతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో సమంత ఏమాత్రం బెరుకు లేకుండా సమాధానాలు చెప్పి.. అలరించింది. ఇక ఏమాయ చేసావే చిత్రం గురించి సమంత మాట్లాడింది. డార్లింగ్, ఏమాయ చేసావే రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయని ఆమె చెప్పింది.
ఎన్టీఆర్ కు సరదాగా సమంత విసుగు తెప్పించింది. సమాధానం చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకపోవడం.. ఫిక్స్ చేయమంటారా అంటే.. ఏం సమాధానం రాకపోవడం ఇలా అతడికి విసుకు పుట్టించింది సమంత. ఇదంతా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసమే అని తెలిసిపోయింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR చిత్రం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. టీజర్ లో మీ వాయిస్ బుగుందంటూ మెచ్చుకున్నారు.. అప్పటి సావిత్రిలో ఉన్న నటన ప్రస్తుతం మీలో చూస్తున్నట్లు ఎన్టీఆర్ కితాబిస్తాడు. ఇలా షోలో సమంత సందడి సందడిగా గడిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…