బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి కూడా లవ్ స్టోరీలు నడిచాయి. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్నా సీజన్ 5 లో కూడా ఇలాంటి కపుల్స్ ఉన్నారు. అంతక ముందు రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి జోడి, అలాగే అఖిల్, మోనాల్ జోడీలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీరామ చంద్ర, హమిదా బెస్ట్ కపుల్ గా మూడు వారాలు ప్రేక్షకులను మెప్పించారు.
కానీ అనూహ్యంగా హమిదా 5వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో శ్రీరామ చంద్ర డల్ అయ్యాడు. అతడు చెప్పకపోయినా హౌస్ లో అతడి వ్యవహార శైలి బట్టి ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇదిలా ఉండగా.. మానస్, ప్రియాంక్ సింగ్ మధ్య కూడా లవ్ స్టోరీ నడుస్తోంది. ప్రియాంక ప్రపోజ్ చేసినా.. మానస్ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కానీ బిగ్ బాస్ మాత్రం వాళ్లిద్దరినే ఫోకస్ చేసి మరీ చూపిస్తున్నాడు.
అయితే మానస్, ప్రియాంక పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దీనిపై మానస్ తల్లి పద్మిని స్పందించారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంది కపుల్స్ బయటకు వచ్చారు. బయక కూడా అలానే ఉన్నారా.. ఎంత మంది పెళ్లి చేసుకున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రియాంక అంటే తనకు ఇష్టమని.. ఆమె మానస్ విషయంలో కాస్తంగా క్లోజ్ గా ఉంటుంది అంతే గానీ.. పెళ్లి మాత్రం కాదు అంటూ చెప్పేసింది.
కానీ ప్రియాంకకు పెళ్లి చేసే విషయంలో తాను దగ్గర ఉండి చేయిస్తానని.. ఆమెకు తగిన అబ్బాయిని చూపించి.. ఆమె ఒప్పుకుంటే సాయం చేయడంతో పాటు.. బాధ్యతగా అన్నీ చూసేకుంటానని చెప్పింది. హౌస్ లో ఒకానొక సందర్బంలో ప్రియాంక మానస్ ను అతడు హస్బెండ్ మెటీరియల్ అని అంటే.. తనను నేనే మరదలిగా ట్రీట్ చేస్తున్నా అంటూ మానస్ అంటాడు. మానస్ తో ప్రియాంక పెళ్లికి మాత్రం తాను ఒప్పుకోను అంటూ ఓ ఇంటర్వ్యూలో పద్మిని చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…