బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎన్నో ఎమోషన్ సన్నివేశాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దాదాపు 80 రోజులు కావడంతో ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులను హౌస్ లోపలకి పంపించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కాజల్, శ్రీరామ్, మానస్, సిరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సన్నీ, రవి, పింకీ,షన్ను మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి భార్య నిత్య రావడంతో సంతోషపడిన రవి అనంతరం తన కూతురు రాలేదని బాధపడ్డారు. అయితే కొంత సమయానికి తన కూతుర్ని పంపించి బిగ్ బాస్ రవికి సర్ ప్రైస్ ఇచ్చారు.
ఇలా తన కూతురిని చూడటంతో రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం రవి తనకు బిగ్ బాస్ అంకుల్ ని చూపించమని కోరింది. అలాగే రవి కూతురు వియా రావడంతో హౌస్ మొత్తం ఎంతో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రతి రోజు టీవీలో నిన్ను చూస్తూ మమ్మీ ఏడుస్తుందని వియా తన తండ్రికి ఫిర్యాదు చేసింది.
రవి కోసం బిగ్ బాస్ గుమ్మాడి గుమ్మాడి అనే పాటను ప్లే చేయడంతో హౌ సభ్యులందరూ ఎంతో సరదాగా డాన్స్ చేశారు.ఈ విధంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ నుంచి బయటకు రావాలని సూచించడంతో కంటెస్టెంట్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…