బిగ్ బాస్ అంతా గత రెండు మూడు రోజుల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ తో కళకళలాడుతోంది. ఎమోషన్స్ తో పాటు ఉప్పోంగిపోతోంది. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి సంతోషంలో తేలిపోతున్నారు. హౌస్ అంతా ఎప్పుడూ గొడవలు, చిరాకులతో నిండిపోయేది.. ఇప్పుడు భావోద్వేగంతో నిండిపోతోంది.
ఇక మొదటి రోజు హౌస్ లో శ్రీరామచంద్ర ఫ్యామిలీ, కాజల్ ఫ్యామిలీ, సన్నీ ఫ్యామిలీ మెంబర్స్, మానస్ ఫ్యామిలీ, సిరి ఫ్యామిలీలు రాగా.. రెండో రోజు యాంకర్ రవి, ప్రియాంక సింగ్ మరియు షణ్ముఖ్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఏ తప్పు చేస్తున్నారో ఇన్ డైరెక్ట్ గా చెబుతూ.. ఆటపై ఫోకస్ పెట్టండి అంటూ చెప్పారు. ఇక ప్రియాంక కోసం తన సోదరి మధు వచ్చింది.
వచ్చిరాగానే మానస్ కు సారీ అండీ అని చెప్తుంది. ఆమె అతడికి సారీ ఎందుకు చెప్పిందో ఇంట్లో ఉన్న వాళ్లకు ఏమి అర్థం కాలే కానీ.. ఆమె అలా చెప్పడానికి గల కారణం ఉంది. ప్రియాంక సింగ్ కు సపోర్ట్ ఇవ్వడం.. ఇక ఆ ఇష్టం అనేది వేరే విధంగా పోతుండటంతో.. ప్రియాంకకు ఆమె సోదరి వార్నింగ్ ఇస్తూ.. ఆటపై ఫోకస్ పెట్టు అంటూ పరోక్షంగా చెప్పింది.
దానిని దృష్టిలో ఉంచుకొని ఆమె మానస్ కు సారీ చెప్పింది. ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. వాళ్ల అమ్మ హౌస్ లోకి వచ్చారు. వేరే వాళ్ల కోసం ఆట ఆడోద్దు.. ట్రిప్ అవ్వోద్దు.. నీ ఆటపై దృష్టి పెట్టు అంటూ ఆమె సలహా ఇచ్చారు. ఇక గేమ్ గేమ్ లా చూడు.. ఎక్కువ ఎమోషనల్ అవ్వొద్దు అంటూ ఆమె చెప్పారు. ఇక ఒకే దగ్గర కూర్చోకు.. అందరితో కలిసి మాట్లాడు అని తన కొడుకు షణ్ముఖ్ కు సలహా ఇస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…