ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు.. ఏ పరిశ్రమలో అయినా వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారసులే ఎక్కువగా నటనవైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు.
కుమార్తెలు మాత్రం వెండితెరకి దూరంగానే ఉంటున్నారు. బాలీవుడ్ లో ఇలా వారసురాళ్లు పరిశ్రమలో బాగానే అడుగుపెట్టేశారు. కానీ మన తెలుగులో మాత్రం అరుదనే చెప్పాలి.
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ, రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక, సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల, నాగబాబు కూతురు నిహారిక లాంటి వారసురాళ్లు వచ్చినా వాళ్ళు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు.
కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ.. స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇప్పటికే పూరి కొడుకు ఆకాష్ హీరోగా రొమాంటిక్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవిత్ర ముస్తాబయ్యే తీరు చూస్తుంటే.. కచ్చితంగా హీరోయిన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కానీ ఆమెకు నిర్మాతగా స్థిరపడాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అతడి నిర్మాణ నేపథ్యంలో లైగర్ రాబోతోంది. ఇదే నిర్మాణంలో పవిత్ర కూడా త్వరలోనే కచ్చితంగా భాగం కానుందనేది బయటక వినిపిస్తున్న టాక్.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…