Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమం ఏడవ సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సీజన్ మాత్రం పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడం పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే మొదటిసారి ఈ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచినటువంటి అమర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కార్యక్రమం గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ నేను బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా పెద్ద స్టార్ అయ్యాను. ఒకప్పుడు మామూలు నటుడుగానే ఉండేవాడిని ఇప్పుడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నానని తెలిపారు.
అంతేకాకుండా నా అభిమాన హీరో రవితేజ సినిమాలో కూడా నాకు ఛాన్స్ వచ్చిందని ఇంతకన్నా పెద్ద గెలుపు నా జీవితానికి ఏది లేదని రవితేజ సినిమా నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నానని ఈయన తెలిపారు. ఇక ఈ సినిమాలో మాత్రమే కాకుండా చాలా ఆఫర్స్ వస్తున్నాయని అవన్నీ కూడా ఒక రోజు మీకు చెబుతాను అంటూ అమర్ వెల్లడించారు.
తప్పుగా అర్థం చేసుకున్నారు…
ఇక పల్లవి ప్రశాంత్ అరెస్టు గురించి మాట్లాడుతూ తాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నానన్న ఆనందంతో బయటకు వచ్చాను కానీ బయట జరిగిన దాడి వల్ల ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయిందని ఈయన తెలియజేశారు అయితే పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేయడం అనేది ఒక మిస్ అండర్స్టాండింగ్ కారణంగానే తనని అరెస్టు చేశారని అయితే ఇప్పుడు అన్ని సెట్ అయ్యాయి అందరం హ్యాపీగా ఉన్నాము అంటూ ఈ సందర్భంగా అమర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…