Shivaji: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిలో శివాజీ పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ కూడా ఒకే టీం గా ఉండి గేమ్ ఆడటమే కాకుండా చివరి వరకు కూడా శివాజీ పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తూ వచ్చారు.
ఇక శివాజీ ఏది చెబితే పల్లవి ప్రశాంత్ శిరసా వహించేవారు ఇలా తన శిష్యుడిగా పల్లవి ప్రశాంత్ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో శివాజీ తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను ప్రశాంత్ ను సపోర్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేశారు. పల్లవి ప్రశాంత్ చాలా అమాయకుడు తనకు మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయాలను కూడా తనకు తెలియదని తెలిపారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేనే నా ఇంట్లో తన సోషల్ మీడియాలను మానిటైజ్ చేసి ఇచ్చానని తెలిపారు.
లక్షలు సంపాదించేవాడు…
ఇక అందరూ కూడా పల్లవి ప్రశాంత్ కు రెండు ఫేస్ లు ఉన్నాయని ఒక్కరి దగ్గర ఒక్కోలా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాడికి అన్ని తెలివితేటలే ఉంటే తన ఫాలోవర్స్ తో లక్షలు సంపాదించుకునే వాడు. కానీ వాడు ఆ పని చేయలేదు. అసలైన కామన్‌మెన్ అంటే వాడేనని తనని చూస్తే చాలా నిజాయితీపరుడు అనిపించింది అందుకే తనని సపోర్ట్ చేశాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…