Pawan Kalyan: సంచలనాత్మక జ్యోతిష్యులు వేణు స్వామి తరచూ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన అనంతరం పలువురు సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో ఈయన పలువురు సెలబ్రిటీల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ క్రమంలోనే నటుడు రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకం గురించి పలు సందర్భాలలో ఎన్నో విషయాలను తెలియచేసినటువంటి వేణు స్వామి మరోసారి ఈయన జాతకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా తన కెరియర్ చాలా అద్భుతంగా ఉందని తెలిపారు సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు ఇస్తారు కనుక ఆయన కెరియర్ అద్భుతంగా ఉందని తెలిపారు.
అయితే ఆయన రాజకీయాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఆయనకు సలహాలు ఇచ్చేవారు లేక తన కెరియర్ నాశనం చేసుకుంటున్నారని వేణు స్వామి తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే మార్గాలను వెతకడం లేదని ఈయన తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయితే నేను కూడా సంతోషిస్తానని తెలిపారు. అంతేకాకుండా తన మూడో భార్యతో పవన్ కళ్యాణ్ కు విడాకులు తప్పవు అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ ఏడాదే విడాకులు..
ఇక తన మూడో భార్య అన్నాతో వ్యక్తిగత విభేదాలు కారణంగానే ఈయన విడాకులు తీసుకుంటారని అది కూడా ఈ ఏడాదిలోనే విడాకులు తీసుకుంటారు అంటూ వేణు స్వామి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు సంచలనంగా మారాయి అయితే ఈ కామెంట్ల పై పవన్ కళ్యాణ్ అభిమానులు యధావిధిగా ఈయన పై ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…