Bigg Boss 8: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి త్వరలోనే ఈ కార్యక్రమం తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే 7 సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటివారంలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ఈసారి కూడా హోస్టుగా నాగార్జున వ్యవహరించబోతున్నారు ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా కొందరి పేర్లు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. ఈ కంటెస్టెంట్లు తప్పనిసరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే.. రాజ్ తరుణ్, ప్రభాస్ శీను, గాయత్రి గుప్తా, యాంకర్ వింధ్య, ఆస్ట్రాలజర్ వేణు స్వామి, యాంకర్ నిఖిల్, యూట్యూబర్ బం చిక్ బబ్లూ, డాన్సర్ శ్వేత నాయుడు, నటి దీపిక, సీరియల్ నటుడు ఇంద్రనీల్, కమెడియన్ సద్దాం, కమెడియన్ యాదమ్మ రాజు సీనియర్ నటి సన, కిరాక్ ఆర్పీ, యాంకర్ శివ పేర్లు వైరల్ అవుతున్నాయి.
నాగార్జున హోస్ట్…
ఇక ఈ 15 మందిలో ఆస్ట్రాలర్ వేణుస్వామికి అవకాశం వచ్చిన చివరిలో ఈ అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తుంది. అలాగే యాంకర్ విద్య కూడా ప్రస్తుతం వరుస కార్యక్రమాలలో బిజీగా ఉన్న తరుణంలో ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు సమాచారం ఇక రాజ్ తరుణ్ కూడా ప్రస్తుతం వివాదాలలో ఉన్న నేపథ్యంలో ఈయనని హౌస్ లోకి తీసుకోవాలని ఆలోచన విరమించుకున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…