Featured

Bimbisara : నందమూరి ఫ్యాన్స్ మెగాస్టార్ ని ట్రోల్ చేయడం వెనుక అల్లు అర్జున్..?

Bimbisara : టికెట్ రేట్లు పెరగడం, ఓటీటీ మాధ్యమాల వల్ల జనాలు సినిమాలను థియేటర్లలో చూడటం మానేశారు. ఈ సంక్షోభంలో బింబిసార, సీతా రామం సినిమాలు విడుదల అయి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ కి రప్పిస్తున్నాయి. ఈ విషయం సినిమా ఇండస్ట్రీ కి శుభపరిణామమని సినిమా వర్గాలు భావిస్తున్నారు. అయితే అంతా బాగున్న సమయంలో నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరిగింది. మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసారు కొంతమంది. దీంతో ఒక్క సినిమా హిట్ అవ్వగానే మెగాస్టార్ అని ఎలా అంటారు అని ఒకవైపు నందమూరి వాళ్లను మెగా వాళ్ళు ట్రోల్ చేస్తుంటే నందమూరి ఫ్యాన్స్ మెగా వాళ్లను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కి తెర లేపారు.

మెగా, నందమూరి వార్ మధ్యలో బన్నీ…

మెగాస్టార్ ని నందమూరి ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్న విషయంలో ఇప్పుడు బన్నీ ఎంటర్ అయ్యాడు. బన్నీ ఈ మధ్య నందమూరి ఫ్యామిలీ కి దగ్గరై మెగా ఫ్యామిలీ కి దూరంగా జరుగుతున్నాడని, బన్నీ ఫ్యాన్స్ ఇలా ట్రోల్ కి కారణం అని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం పై అనలిస్ట్ శ్రీనివాసరావు గారు స్పందించారు. సినిమా ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబాలైన మెగా నందమూరి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మధ్యలో ఫ్యాన్స్ ఇలా చిచ్చు పెట్టి గొడవలకు కారణం అవుతారు. ఇప్పుడున్న సంక్షోభం లో నా సినిమా హిట్ అయితే చాలు అని ఏ హీరో అనుకోవడం లేదు, అన్ని సినిమాలు బాగా ఆడాలి మళ్ళీ థియేటర్ కి జనం రావాలి అని కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ లో కూడా కులం వర్గమనే పిచ్చి రోగం మధ్యలో వచ్చింది, అయితే అది ముదిరిపోయి ఇప్పుడిప్పుడే నయం అయింది.

మళ్ళీ అందరూ కలిసి ఒకరి సినిమాకు ఒకరు సహాయం అందించుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ కి విబేధాలు ఉన్నాయని అనుకోవడం లేదు. మెగాస్టార్ అంటే బన్నీ కి ఎప్పుడు గౌరవం ఉంది అంటూ చెప్పారు శ్రీనివాసరావు. ఆహా ఒరిజినల్స్ లో బాలకృష్ణ హోస్ట్ గా ఉండటం, అఖండ సినిమా ఈవెంన్ట్ కు బన్నీ రావడం, మెగాస్టార్ ఫ్యామిలీ కి దూరం అవ్వడం కాదు అంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ స్క్రిప్ట్ కొంత మంది డైరెక్టర్లు సెట్స్ లో రాస్తారు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడం అన్న వాఖ్యలను బింబిసార ఈవెంట్లో కళ్యాణ్ రాం కి ఎదురావగా వాళ్ళ సినిమాలో అలా జరిగిందేమో మా సినిమాలో అలా జరగలేదు అని చెప్పారు. దీనికి కూడా ద్వంద అర్థాలు తీయడం ఎందుకు అని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

5 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

6 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

6 hours ago