Featured

Dulquer Salmaan : ఇండస్ట్రీలో నా పరువు తీయొద్దు అంటూ నాన్న నా మీద ఫైర్ అయ్యారు.. నేను హీరో అవ్వడం ఆయనకు ఇష్టం లేదు : దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan : సినిమాల్లో వారసత్వం సహజం, తెలుగులో అగ్ర హీరోల పిల్లలు, మనవళ్ళు సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. ఇక హీరోలు కూడా తమ పిల్లలు తమ తరవాత సినిమాల్లో మంచి స్థానంలో తమ పేరుని నిలబెట్టాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక అగ్ర హీరో తన కొడుకు సినిమాల్లోకి రావడానికి ఒప్పుకోలేదట. పెద్ద గొడవే చేసాడట కొడుకు సినిమాల్లోకి వస్తానంటే. ఎవరా హీరో అనుకుంటున్నారా.. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సినిమాల్లోకి రావడం ఆయనకు అస్సలు ఇష్టం లేదట.

సినిమాల్లోకి వెళ్తానంటే బాధపడ్డారు…

మలయాళం హీరో అయిన దుల్కర్ సల్మాన్ ‘మహానటి’ సినిమాతో తెలుగు వారికి పరిచయమాయ్యాడు. జెమినీ గణేశన్ లాగా తన నటనతో అందరినీ మెప్పించాడు. ఇక ఆ తరువాత మళ్ళీ ‘కనులు కనులను దోచాయాంటే’ సినిమా కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక చాలా రోజుల తరువాత దుల్కర్ నటించిన ‘సీతా రామం’ సినిమా తో మరో సారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హనుమాన్ రాఘవాపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ గా దుల్కర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. విడుదలైన అన్ని థియేటర్స్ లోనూ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లోనే దుల్కర్ తాను నటుడవ్వడం తన తండ్రికి ఇష్టం లేదనే విషయాన్ని పంచుకున్నారు. మమ్ముట్టి గారికి దుల్కర్ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట అందుకే ఫైట్స్, డాన్సులు ఏమి నేర్పించలేదట, ఇక తండ్రి ఇష్టం ప్రకారమే చదువుకుని దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న దుల్కర్ కి ఆ నాలుగు గోడల మధ్య పని చేస్తూ బ్రతకడం నచ్చక ఇండియా వచ్చేసాడు. ఇక సినిమాల్లోకి వెళ్తానని అడుగగానే మమ్ముట్టి గారు పెద్ద గొడవే చేసారాట. మొదటి సారిగా ఆయన అంతలా రియాక్ట్ అవడం చూసానని దుల్కర్ చెప్పారు. డాన్సలు, ఫైట్లు వంటివి కూడా శిక్షణ తీసుకోలేదు, నటించడం అంటే సులువు కాదు నువ్వు ఇండస్ట్రీ కి వచ్చి నా పరువు తీస్తావా అని బాగా చివాట్లు పెట్టారట మమ్ముట్టి.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

9 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

9 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

9 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

9 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

9 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

9 hours ago