చెల్లాచెదురైన జీవితాలు అంటూ ఏపీ వరదలపై స్పందించిన రాములమ్మ..!

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అధికంగా పడటంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఇదిలా ఉండగా ఏపీ వరదలపై తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సినీ నటి విజయశాంతి స్పందించారు. తుఫాను ప్రభావం వల్ల రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

ఈ క్రమంలోనే విజయశాంతి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ కన్నీటి కడలిలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రాయలసీమ జిల్లాలను చూస్తే గుండె బరువెక్కుతోంది. అధిక వర్షం ప్రభావం కారణంగా వాగులు వంకలు పొంగి గ్రామాలను నీటిలో ముంచేశాయి.

కళ్ళ ముందే ఎన్నో మూగజీవాలు కుటుంబసభ్యులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అలాగే చేతికొచ్చిన పంట నాశనం కావడంతో ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురై పోయాయి. వీరి జీవితాలు ఎప్పటికీ తేరుకు ఉంటాయో అంటూ విజయశాంతి ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వీరికి తోడుగా మానవవనరుల సహాయం అవసరం అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఎన్సీసీ విద్యార్థులను తీసుకుంటే త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవచ్చు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. రాయలసీమలోని పలు జిల్లాలలో వరద బీభత్సం అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడ్డాయి.