బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ఎంతటి ప్రేక్షకాదరణ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ భాషలలో ఈ కార్యక్రమం సీజన్లను పూర్తిచేసుకుని దూసుకుపోతుంది. తెలుగులో ప్రస్తుతం నాలుగు సీజన్లలో పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.అదే విధంగా తమిళంలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.
తమిళంలో ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కమల్ హాసన్ అమెరికా వెళ్లి రావడం వల్ల ఆయన కరోనా బారిన పడటంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు.ఇక కమల్ హాసన్ బాధ్యతలను నిర్వర్తించడానికి తన తనయ శ్రుతి హాసన్ ను తీసుకురావడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారట.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం కోసం ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరించడంతో అతని స్థానంలో శృతిహాసన్ అయితే బాగుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
మరి ఈ కార్యక్రమానికి శృతి హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…